పూర్వ విద్యార్థులచే వైద్య శిబిరం.

పూర్వ విద్యార్థులచే వైద్య శిబిరం.

ది. 24-3-2019 తేదీన గోకవరం మండలం భూపతిపాలెంలో గల డా. డి.యస్.రాజు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయంలో ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులచే వైద్య శిబిరం నిర్వహించబడింది.  ఈ కార్యక్రమానికి 1995 బ్యాచ్ పూర్వ విద్యార్థి మరియు ఎన్టీఆర్ వైద్యసేవ , తూర్పు గోదావరి జిల్లా సమన్వయకర్త డా. వి. వర ప్రసాద్ నేతృత్వం వహించారు. 1995 బ్యాచ్ కే చెందిన డా. కె. రమేష్ మరియు ‘గౌతమి నేత్రాలయం, రాజమహేంద్రవరం’ టీమ్ పాల్గొని జనరల్, డెర్మటాలజీ మరియు ఆఫ్తాల్మజీ అంశాలలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఇద్దరు విద్యార్థులలో గుండె సంబంధిత సమస్యలను గుర్తించి వారిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తదుపరి పరీక్షల నిమిత్తం రిఫర్ చేసారు. కంటి పరీక్షలలో అవసరమైన విద్యార్థులకు త్వరలో కళ్ళజోళ్ళు అంద జేయనున్నారు.  1987 బ్యాచ్ పూర్వ విద్యార్థి ఎ.జయచంద్రన్ దంపతులు ఈ శిబిరంలో పాల్గొని సుమారు ఇరవై వేల రూపాయల మందులను ఉచితంగా అందజేసారు.  ఉదయం 9 గం.ల నుండి సాయంత్రం 4 గం. ల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పి.బి.శ్రీనివాస్ (1988),  ప్రధాన కార్యదర్శి యామన రమేష్ (1994),  సంఘం సలహాదారులు శ్రీ యం. సత్యనారాయణ, ఇంకా దండు బాబ్జీ (1988), పి.కామేశ్వర రావు, ఎం.వెంకట్రావు (1989),1990 బ్యాచ్ కి చెందిన వి.వి.వి.యస్.ఎన్. వర్మ, మోహన్ బాబు, ఆర్.కనకాచార్యులు, పి.సి.యస్.ఫణి కుమార్; 1991 బ్యాచ్ వెలగల సుబ్బారెడ్డి, 1994 బ్యాచ్ కె.ఎస్.ఎన్.పి. వెంకటేశ్వర రావు, వై.శేషు కుమార్, 1995 బ్యాచ్ కె.కృష్ణా రెడ్డి,  ఓ. రామ కృష్ణ;  పి. గంగా ప్రసాద్ (2001), కె.వి.వి.యస్. చక్రధర్,  యు.పి.ఎ. నాని బాబు (2003) మరియు ఐ.వి.వి.దుర్గా ప్రసాద్ (2005) పాల్గొని ప్రస్తుత విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి,  కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సి.హెచ్.రామ కృష్ణ, ఉపాద్యాయులు ఉదయ భాస్కర్, రాజీవ్ ఇతర సిబ్బంది తమ సహకారం అందించారు.

   

No Comments

Post A Comment