విన్నపము

విన్నపము

డా|| డి.ఎస్.రాజు, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల భూపతిపాలెంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు; మరియు ఈ పాఠశాలలో గతంలో పనిచేసిన (లేదా) ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అందరికీ విజ్ఞప్తి.

పాఠశాలతో అనుబంధం ఉన్న వారందరూ ఈ వెబ్ సైట్ నందు ‘స్టూడెంట్ లాగిన్ లేదా ‘స్టాఫ్ లాగిన్’ నందు మీయొక్క వ్యక్తిగత మరియు వాస్తవిక సమాచారం ‘రిజిస్ట్రేషన్ ఫారంలో’ అందించి మీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాము.

సభ్యులను సులభంగా గుర్తించుటకు ‘యూజర్ నేమ్’ అంశంలో విద్యార్థి అయితే ‘పాఠశాలలో ప్రవేశించిన సంవత్సరము – పేరు – ప్రవేశించిన తరగతి’ గాను; సిబ్బంది అయితే ‘పాఠశాలలో మొదట ప్రవేశించిన సంవత్సరము – పేరు’ గాను నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ఉదా:- 1981 D.S.V.Ramana Murthy 5

సభ్యులు నమోదు చేసిన సమాచారం ఆధారంగా ‘అడ్మిన్’ మీ యొక్క సభ్యత్వాన్ని ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుంది. సభ్యుల సమాచారం తదుపరి వెబ్ సైట్ నందు పొందుపరచబడును. మన పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి, భావి తరాల భవిష్యత్తుకు మీ వంతు బాధ్యతగా సహకరించవలసిందిగా అందరికీ మా విజ్ఞప్తి.

-నిర్వాహకులు

No Comments

Post A Comment